కర్ణాటకలోని మంగళూరులో షాకింగ్ ఘటన జరిగింది. రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి సతీష్‌కు ఆయన పొరుగింట్లో ఉండే మురళీప్రసాద్‌కు కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న మురళిని సతీష్ కారుతో గురువారం ఢీకొట్టి హత్యాయత్నం చేశాడు. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను సైతం కారుతో ఢీకొట్టాడు. ప్రమాద తీవ్రతకు గోడకు ఆ మహిళ తలకిందులుగా వేలాడింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.