తెలంగాణలోని మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ గ్రామంలో విషాద ఘటన జరిగింది. వంగపాటి నాగరాజు కూలికి వెళ్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అయితే అతడికి ఓ హాబీ ఉంది. ఎవరి ఇంట్లో అయినా పాములు వస్తే వాటిని చాకచక్యంగా పట్టేవాడు. ఇదే కోవలో మంగళవారం సాయంత్రం మండలంలోని కొత్తపల్లిలో ఫంక్షన్ హాల్‌లోకి పాము వచ్చింది. బంధించే క్రమంలో ఆ పాము కాటు వేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు చనిపోయాడు.