లోక్‌సభ స్పీకర్ తీరుపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ అధికార, ప్రతిపక్ష పార్టీలను సమానంగా చూడాలని అన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా సభను వాయిదా వేశారని ఆరోపించారు. నోట్ల కట్టల వ్యవహారంపై జస్టిస్ వర్మ ఎంక్వయిరీ కోరుతూ కాంగ్రెస్ నోటీసు ఇచ్చినా, స్పీకర్ తిరస్కరించి, ముస్లిం రిజర్వేషన్ చర్చకు అనుమతించారని, ఇది ప్రతిపక్షాన్ని అవమానించడమేనని విమర్శించారు.