గర్భిణీల పథకాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదు: సోనియా గాంధీ

78చూసినవారు
గర్భిణీల పథకాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదు: సోనియా గాంధీ
జాతీయ ఆహార భద్రతా చట్టం, గర్భిణీ స్త్రీల పథకంపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ సోనియా గాంధీ రాజ్యసభలో  ప్రసంగించారు. గర్బిణీల పథకానికి నిధుల కొరత తీవ్రంగా ఉందని, ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ ఆరోపించారు. బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి రూ.6వేలు ప్రసూతి ప్రయోజనాలు అందుతాయని, వాటిని రెండు విడతల్లో చెల్లిస్తామని చెప్పారని అన్నారు. కానీ ఈ పథకానికి నిధులే లేవని సోనియా గాంధీ ఆరోపించారు.

సంబంధిత పోస్ట్