ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రతిభతో అదరగొట్టిన అతడు.. ప్రపంచంలో ఇంతవరకు ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టడంతోపాటు నాలుగు క్యాచ్‌లు అందుకుని.. 77 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. దాని ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించాడు.