లాయర్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఆటో (వీడియో)

77చూసినవారు
యూపీలోని లఖింపూర్-ఖేరి ప్రాంతంలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. లాయర్ ధర్మేంద్ర తివారీ బైక్‌పై వెళ్తుండగా ఈ-ఆటో రిక్షా ఆయనను ఢీకొట్టింది. అనంతరం చాలా దూరం ఆయనను ఈడ్చుకెళ్లింది. ఈ-రిక్షా డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అలాగే ముందుకు తీసుకెళ్లాడు. దీంతో ధర్మేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్