ప్రమాదంలో ఉన్న చైనీయుడిని కాపాడిన భారత నేవీ

78చూసినవారు
తీవ్రరక్తస్రావమై ప్రమాదంలో ఉన్న చైనీయుడిని కాపాడేందుకు భారత నేవీ సాహసోపేత ఆపరేషన్ చేపట్టింది. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత.. ముంబైకి 200 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న చైనా సరకు రవాణా నౌక సిబ్బంది తమలో ఒక వ్యక్తి గాయపడినట్లు ముంబైలోని మారిటైం రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్‌కు అత్యవసర మేసేజ్ పంపించారు. దీంతో రంగంలోకి దిగిన ఇండియన్ నేవీ సీ కింగ్ హెలికాప్టర్‌తో అతడ్ని రక్షించి, ఆస్పత్రికి తరలించింది.

సంబంధిత పోస్ట్