AP: టీటీడీ అదనపు ఈవోగా ఐఆర్ఎస్ అధికారి చిరుమామిళ్ల వెంకయ్య చౌదరిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2005 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన వెంకయ్య ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఆయనను డిప్యుటేషన్‌పై ఏపీకి పంపింది. కాగా ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావుని టీడీడీ ఈవోగా ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.