160 కిలోమీటర్లు పరుగెత్తిన ఆర్మీ రిటైర్డ్ మహిళా అధికారి (Video)

58చూసినవారు
కార్గిల్ విజయ్ దివస్‌ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా లెఫ్టినెంట్ కల్నల్ బర్షారాయ్ (రిటైర్డ్) 4 రోజుల్లో 160 కిలోమీటర్ల పరుగును పూర్తిచేశారు. శ్రీనగర్ నుంచి ద్రాస్ వరకు పరుగును విజయవంతంగా పూర్తిచేశారు. దేశం కోసం ప్రాణాలర్పించి మన సైనికుల త్యాగాలకు నివాళిగా తాను ఈ పరుగును పూర్తిచేసినట్టు ఆమె తెలిపారు. ఈ నెల 19న శ్రీనగర్‌లో పరుగును ప్రారంభించిన ఆమె 22న ద్రాస్ సెక్టార్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్‌కు చేరుకోవడంతో ముగిసింది.

సంబంధిత పోస్ట్