గుజరాత్‌లో రైలు ఢీకొన్న ఘటనలో రెండు సింహాలు తీవ్రంగా గాయపడ్డాయి. అమ్రేలీ జిల్లాలోని హతీగడ్-బేసన్ రూట్లో ఈ ఘటన జరిగింది. భారీ వర్షం పడుతున్న సమయంలో.. ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిదేళ్ల సింహానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత మహువా సూరత్ ప్యాసింజర్ రైలును గంట పాటు నిలిపేశారు. గాయపడిన సింహాన్ని చికిత్స కోసం వైల్డ్‌లైఫ్ సంరక్షణ కేంద్రానికి తరలించింది.