గుజరాత్‌లో నదులుగా మారిన వీధులు (వీడియో)

53చూసినవారు
రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో గత కొద్ది రోజులుగా వర్షాలు వదలడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు వరదలా ప్రవహిస్తోంది. గురువారం కూడా గుజరాత్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో వీధులు నదుల్లా మారాయి. పలువురు ఈ వీడియోలను షేర్ చేస్తూ ప్రధాని సొంత రాష్ట్రంలో పరిస్థితి ఇది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్