నేడు తెలంగాణలో ఆటోల బంద్

205515చూసినవారు
నేడు తెలంగాణలో ఆటోల బంద్
ఉచిత బస్సు పథకం కారణంగా ఆటోల వైపు చూసేవారు కరువయ్యారు. కిస్తీలు కట్టుకోలేక, కుటుంబ పోషణ భారమై ఆటో డ్రైవర్లు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. దాంతో ఆటోడ్రైవర్లు బంద్‌కు పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో బంద్‌ను విజయవంతం చేయాలని టీఏటీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య కోరారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్