బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ ప్రాంతంలో ఆటోమేటిక్ పానీపూరి వెండింగ్ మెషీన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి "వాట్ ది ఫ్లేవర్స్" అని పేరు పెట్టారు. ఈ మెషీన్ ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన వివిధ రుచులను ఎంచుకోవచ్చు. రకరకాల ఫ్లేవర్స్‌లో పానీ లభ్యమవుతుంది. అయితే, ఈ యంత్రం ఆహార పరిశుభ్రత గురించి చర్చలకు దారితీసింది. కాగా, కర్ణాటకలోని ఆహార భద్రతా అధికారులు ఇటీవల హానికరమైన పదార్థాలను కనుగొన్న సంగతి తెలిసిందే.