ర్యాగింగ్‌ చట్టాలపై అవగాహన తప్పనిసరి

59చూసినవారు
ర్యాగింగ్‌ చట్టాలపై అవగాహన తప్పనిసరి
విద్యార్థులకు చట్టాలపై అవగాహన అంతంతమాత్రంగానే ఉంది. ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ర్యాగింగ్‌ యాక్ట్‌ 2011 ఉంటుంది. దీంతో పాటు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ఐపీసీ 294, 232, 339, 340, 506 సెక్షన్ల ప్రకారం శిక్షార్హులు. కళాశాలలో చేరే ప్రతి విద్యార్థి ఈ చట్టాలను తెలుసుకోవడం శ్రేయస్కరం. ప్రతి విద్యా సంస్థల్లో యాంటీ ర్యాగింగ్‌ సెల్‌ ఉంటుంది. ఏదైనా సమస్య ఏర్పడితే వారికి ఫిర్యాదు చేయవచ్చు. అక్కడ పట్టించుకోకపోతే స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇవ్వొచ్చు.

సంబంధిత పోస్ట్