తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా MLAలు మల్లారెడ్డి రంగారెడ్డి, ప్రసాద్ కుమార్, టి.రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్‌కు లేఖ రాసి, మంత్రివర్గంలో తమ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ సంతకం చేసిన ఈ లేఖలో హైదరాబాద్ జిల్లాకు కూడా స్థానం లేదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేను MLAలు కలిసి తమ కోరికను వివరించనున్నారు.