గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగంగా తల్లి, బిడ్డకు పాలు పట్టడం సహజం. కానీ పట్టణాల్లోకి వచ్చేసరికి రైళ్లు, బస్సుల్లో, బహిరంగ ప్రదేశాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాలిచ్చే సమయంలో కొన్ని విషపు చూపుల మధ్య పసిబిడ్డ ఏడ్చిన వెంటనే పాలుపట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి వారిలో మార్పు రావాలి. బిడ్డకు పాలు పట్టే సమయంలో తన తల్లిగానే ప్రతి ఒక్కరూ భావించే గుణం రావాలి. ప్రత్యేకంగా పబ్లిక్ బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.