దారుణంగా కొట్టారు.. భర్త మృతి, గర్భం కోల్పోయిన భార్య!

66చూసినవారు
ముంబైలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్ల దాడిలో ఆకాశ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆయన భార్య కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 3 నెలల గర్భవతిగా ఉన్న ఆమె గర్భాన్ని కోల్పోయినట్లు సమాచారం. ఆటో ర్యాష్ గా ఓవర్టేక్ చేయడంతో ఆకాశ్ ప్రశ్నించాడు. దీంతో డ్రైవర్ సహా 15 మంది స్నేహితులు అతడిపై దాడి చేశారు. ఆకాశ్ తల్లి కుమారుడిపై పడుకుని రక్షించేందుకు ప్రయత్నించినా వారు తగ్గలేదు. అడ్డుకున్న మరో వ్యక్తిపై కూడా దాడి చేశారు.

సంబంధిత పోస్ట్