భాగమతి రైలు ప్రమాదం.. తప్పిన ప్రాణ నష్టం

63చూసినవారు
భాగమతి రైలు ప్రమాదం.. తప్పిన ప్రాణ నష్టం
తమిళనాడులో శుక్రవారం రాత్రి భారీ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. భాగమతి ఎక్స్‌ప్రెస్‌(12578) వేగంగా వచ్చి తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ రైలును ఢీకొంది. 13 వరకు కోచ్‌లు పట్టాలు తప్పాయి. కొన్ని చెల్లాచెదురుగా పడిపోగా, మరికొన్ని ఒకదాని పైకి మరొకటి ఎక్కాయి. సమీప గ్రామాల్లోని ప్రజలు, వివిధ శాఖల సహాయక సిబ్బంది పరుగున వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులెవరూ మరణించలేదని దక్షిణ రైల్వే ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్