ఉత్తర ఇటలీలోని మోన్‌ఫాల్కోన్ అనే పట్టణంలో క్రికెట్ ఆడటంపై నిషేధం విధించారు. కొత్త పిచ్ ను నిర్మించడానికి స్థలం, నిధుల కొరతతో పాటు క్రికెట్ బంతులు తగిలి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుపుతూ స్థానిక మేయర్ అన్నా మారియా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సిసింట్ క్రికెట్ పై నిషేధం విధించారు. పట్టణంలో ఎవరైనా క్రికెట్ ఆడుతూ కనిపిస్తే వారికి ₹9,000 (100 యూరోలు)కు పైగా జరిమానా విధిస్తామని తెలిపారు.