మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో రాజ్యాంగ ప్రతిరూపం ధ్వంసంపై నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనకారులు పిలుపునిచ్చిన బంద్ హింసాత్మకంగా మారింది. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. రైల్వే స్టేషన్ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు గాజు పెట్టెలో ఉంచిన రాజ్యాంగ ప్రతిరూపాన్ని మంగళవారం సాయంత్రం ముర్తిజాపూర్ గ్రామానికి చెందిన సోపాన్ పవార్ అనే వ్యక్తి ధ్వంసం చేశాడు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు.