అర్ష్‌దీప్ బంతికి బంగ్లా బ్యాటర్ ఫ్యూజులు ఔట్ (వీడియో)

63చూసినవారు
టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా నిన్న భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం అందుకుంది. అయితే బంగ్లా బ్యాటర్ లిటన్ దాస్‌ను అర్ష్‌దీప్ అవుట్ చేసిన తీరు మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. అర్ష్‌దీప్ వేసిన ఓ బ్యాకప్ లెంగ్త్ డెలివరీ‌ని లిటన్ దాస్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే ఆఫ్‌ వికెట్ అవతల పడిన ఆ బంతి అనూహ్యంగా స్వింగ్ అయి వికెట్లను పడగొట్టింది. ఆ అద్బుతమైన ఇన్ స్వింగ్ చూసి లిటన్ దాస్ షాకయ్యాడు.

సంబంధిత పోస్ట్