ఇద్దరి ప్రాణం తీసిన బార్బీ క్యూ చికెన్

608చూసినవారు
ఇద్దరి ప్రాణం తీసిన బార్బీ క్యూ చికెన్
తమిళనాడు కొడైకెనాల్‌లో విషాద ఘటన జరిగింది. తిరుచ్చికి చెందిన నలుగురు యువకులు కొడైకెనాల్ వెళ్లారు. శుక్రవారం రాత్రి మద్యం కొన్నారు. మద్యంతో పాటు మంచింగ్ కోసం బార్బీ క్యూ చికెన్ చేసేందుకు సిద్దమయ్యారు. మద్యం మత్తులో స్టవ్ ఆఫ్ చేయలేదు. కాసేపటికే నిద్రలోకి జారుకున్నారు. ఏసీ గదిలో పొగ దట్టంగా అలముకుంది. దీంతో నిద్రలోనే ఇద్దరు యువకులు చనిపోయారు. మరో ఇద్దరు వేరే గదిలో పడుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్