AP: పది నెలల బాలుడు మింగిన బ్యాటరీని తిరుపతిలోని స్విమ్స్ వైద్యులు తొలగించారు. బాలుడు ఆరోగ్యం మెరుగవడంతో మంగళవారం డిశ్చార్జి చేశారు. శ్రీకాళహస్తికి చెందిన బాలుడు ఇంట్లోని గుండ్రటి చిన్నపాటి బ్యాటరీ మింగాడు. అది చూసిన కుటుంబ సభ్యులు స్విమ్స్‌కు తీసుకువచ్చారు. సర్జికల్ గ్యాస్టో ఎంట్రాలజ విభాగం వైద్యులు ఎక్స్‌రేలో పరిశీలించి ఎండోస్కోపీ ద్వారా బయటకు తీశారు.