తెలంగాణలో బీర్ల సరఫరా నిలిపివేతపై యూబీఎల్ వివరణ ఇచ్చింది. 2019 నుంచి తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ధరలు పెంచలేదని తెలిపింది. 'కొన్ని నెలలుగా నష్టాలు భరిస్తూ బీర్లు సరఫరా చేశాం. ధరలు సవరించాలని TGBCLను అనేక సార్లు కోరాం. TGBCL నుంచి రావల్సిన బిల్లుల బకాయిలు కూడా భారంగా మారాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు, తక్కువ ధరతో బీర్ల సరఫరాకు కట్టుబడి ఉన్నాం. ధరలు సవరించాలని TGBCLను మరోసారి కోరుతున్నాం' అని పేర్కొంది. కాగా బుధవారం నుంచి రాష్ట్రంలో KF బీర్ల సరఫరా నిలిచిపోయింది.