జర్మనీకి చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్.. రికార్డు స్థాయి అమ్మకాలు నమోదు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 18,123 యూనిట్లను విక్రయించింది. దేశీయంగా SUVలకు పెరిగిన డిమాండ్‌తో అంతకుముందు ఏడాది విక్రయించిన వాహనాలతో పోలిస్తే 10 శాతం పెరిగాయని మెర్సిడెజ్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ తెలిపారు. కేవలం జనవరి-మార్చి మధ్యకాలంలోనే సంస్థ 5,412 యూనిట్లను విక్రయించినట్లు వెల్లడించారు.