పెద్దపులి కలకలం.. అప్రమత్తమైన ఫారెస్ట్‌ సిబ్బంది

78చూసినవారు
పెద్దపులి కలకలం.. అప్రమత్తమైన ఫారెస్ట్‌ సిబ్బంది
ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలో పెద్దపులి (Tiger) సంచారం కలకలంసృష్టిస్తుంది. రెండు రోజుల క్రితం మండలంలోని చింతలబోరి గ్రామశివారులో అటవీ సిబ్బందికి కనిపించిన పులి.. మళ్లీ బుధవారం ఉ. 6 గంటలకు చింతలగూడ పరిసరాల్లో కనిపించింది. గ్రామస్థులు వెళ్లి చూడగా అది అప్పటికే పత్తి చేనులో నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. ఎద్దులు పులిని చూసి తాళ్లు తెంపుకొని గ్రామానికి పరుగు తీశాయి. అటవీ సిబ్బంది పులి జాడను కనిపెట్టే పనిలో పడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్