గర్భిణిని ఢీకొట్టిన బైకర్.. షాకింగ్ వీడియో

70చూసినవారు
తమిళనాడు మధురై ఒతకడై ప్రాంతంలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గర్భిణి ఊహించని రీతిలో ప్రమాదానికి గురైంది. ఓ బైకర్ వేగంగా వచ్చి ఆమెను వెనుక నుంచి ఢీకొట్టాడు. అనంతరం బైకర్ పరారయ్యాడు. కింద పడిన గర్భిణి తలకు బలమైన గాయమైంది. దీంతో స్థానికులు ఆమెను హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్