రాంగ్ రూట్‌లో వచ్చి ఢీకొన్న కార్.. బైకర్ మృతి (Video)

57చూసినవారు
ఇటీవల గురుగ్రామ్‌లో జరిగిన భయంకర యాక్సిడెంట్‌కు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆదివారం రాత్రి గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్‌ రోడ్డులో ఆకాశ్ గార్గ్ (23), అతడి స్నేహితుడు వేర్వేరు బైక్‌లపై ఆంబియన్స్ మాల్ వైపు వేగంగా వెళ్తున్నారు. అదే సమయంలో మహీంద్రా ఎస్‌యూవీ కారు రాంగ్ రూట్‌లో వస్తోంది. దీంతో బైకర్ ఆ కారును ఢీకొని, అక్కడికక్కడే మరణించాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు మృతుడి స్నేహితుడు మొబైల్‌లో చిత్రీకరించాడు.

సంబంధిత పోస్ట్