ఒకప్పుడు మాత్రం చాలామంది చదివేసిన నవలల్ని సినిమాలుగా తీస్తే ఏఎన్నార్ తనదైన మార్క్ యాక్టింగ్‌తో మైమరిపించారు. దేవదాసు, అర్ధాంగి, చరణదాసి, డాక్టర్ చక్రవర్తి, బంగారు కలలు, చదువుకున్న అమ్మాయిలు, విచిత్రబంధం, తోడికోడళ్లు, మాంగల్య బలం, విచిత్ర బంధం, భార్య భర్తలు, పునర్జన్మ, బాటసారి, వాగ్దానం, ఆరాధన, పూజాఫలం, ప్రేమలు-పెళ్లిళ్లు, ప్రేమనగర్, సెక్రటరీ.. ఇలా ఏఎన్నార్ కెరీర్‌లోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సినిమాలన్నీ నవలలే కావడం విశేషం.