యూపీలోని బిజ్నోర్‌లో, బీజేపీ నగర్ నిగమ్ ఛైర్మన్ డాక్టర్ బీర్బల్ సింగ్ కుమారుడైన.. అభినవ్ సింగ్ 70 ఏళ్ల రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ మరియు అతని భార్యపై దాడికి పాల్పడ్డాడు. ఈ వీడియోలో అభినవ్ వృద్ధ దంపతులపై విచక్షణారహితంగా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.