పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మెదినీపూర్ జిల్లాలో మార్చి 21న ఖరగ్‌పూర్‌లోని 6వ వార్డులో కొత్తగా నిర్మించిన రోడ్డును ప్రారంభించేందుకు బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్ వెళ్లారు. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలు ఆయనను చుట్టుముట్టారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎక్కడా కనిపించలేదంటూ నిరసన తెలిపారు. దీంతో ఆయన సహనం కోల్పోయి, గొంతు నొక్కుతానంటూ మహిళలను బెదిరించారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.