AP: తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి, తనకల్లులో శనివారం మధ్యాహ్నం వడగండ్ల వాన కురిసింది. నంద్యాల, శ్రీశైలం, కర్నూలు జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం కొంతమేర చల్లబడింది.