తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో శనివారం డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. '25 ఏళ్ల వరకు నియోజకవర్గాల పునర్విభజన చేయకూడదని తీర్మానించామని, డీలిమిటేషన్‌కు వ్యతిరేఖంగా తెలంగాణలో త్వరలో రెండో సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జగన్ కూడా తమ వెంటే ఉన్నట్లు పేర్కొన్నారు. కొన్ని కారణాలతో సమావేశానికి హాజరుకాలేదన్నారు.