వైసీపీ మద్దతుదారుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదల అయ్యారు. ఆయనకు గుంటూరు జిల్లా కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. జైలు అధికారులకు శనివారం రిలీజ్ ఆర్డర్స్ అందడంతో ఆయన బయటకు వచ్చారు. పవన్, లోకేష్‌లపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 30 ఫిర్యాదులు రాగా, 17 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 26న ఆయనను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.