సరస్సుల రక్షణకై అక్రమ నిర్మాణాల కూల్చివేత.. రేవంత్ సర్కారును అభినందించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి

74చూసినవారు
సరస్సుల రక్షణకై అక్రమ నిర్మాణాల కూల్చివేత.. రేవంత్ సర్కారును అభినందించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి
సరస్సులను కాపాడేందుకు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలనే నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభినందించారు. ఈ నిర్ణయం తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న పార్టీ మంచి చేస్తే అభినందించాలని, తప్పు చేస్తే నిలదీయాలని తెలిపారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో హైడ్రా చర్యను అభినందిస్తున్నానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్