‘నరసింహ’ చిత్రంలో నీలాంబరి పాత్ర గురించి ఓ సందర్భంలో రమ్యకృష్ణ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘‘ఆ పాత్రను చేయడం మొదట్లో నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు తల పొగరు ఎక్కువగా ఉన్నట్లు ఆ పాత్రను తీర్చిదిద్దారు. అయితే అది కేవలం సినిమాలోని పాత్రే అని నాకు తెలుసు. సౌందర్య ముఖంపై కాలు పెట్టే సన్నివేశంలో నటిస్తున్నప్పుడు నేను చాలా ఇబ్బందిపడ్డాను. కానీ, దర్శకుడి విజన్‌ను నమ్మా కాబట్టి ఆ పాత్రను అంత బాగా చేయగలిగా’’ అని చెప్పుకొచ్చింది.