ప్రముఖ నటుడు సన్నీ డియోల్‌కు బీజేపీ షాక్

557చూసినవారు
ప్రముఖ నటుడు సన్నీ డియోల్‌కు బీజేపీ షాక్
ప్రముఖ నటుడు, సిట్టింగ్ ఎంపీ సన్నీ డియోల్‌కు బీజేపీ టికెట్ నిరాకరించింది. లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ 8వ జాబితాను శనివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానానికి దినేశ్ సింగ్ బబ్బూకు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఆ స్థానం నుంచి సన్నీ డియోల్ బీజేపీ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సన్నీ డియోల్ కొన్ని రోజుల ముందే ప్రకటించారు.

సంబంధిత పోస్ట్