వందే భారత్‌లో బీజేపీ కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించారు: మహిళ ఆరోపణ

85చూసినవారు
ప్రధాని మోడీ శనివారం జెండా ఊపి ప్రారంభించిన వందే భారత్ రైలులో బీజేపీ కార్యకర్తలు తనపై అనుచితంగా ప్రవర్తించి వేధించారని తానియా అనే యువతి ఆరోపించింది. తన సహచరుడితో కలిసి ఫుడ్‌ కోసం పక్క కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లగా ‘ఇది బీజేపీ క్యాబిన్’ అంటూ ఆ పార్టీ కార్యకర్తలు తమను అడ్డుకున్నారని ఆమె ఆరోపించింది. తనతో ఉన్న వ్యక్తిని కొట్టారని తెలిపింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

సంబంధిత పోస్ట్