సాధారణంగా యాపిల్స్ ఎరుపు, పచ్చని రంగుల్లో ఉండటం మనం చూస్తుంటాం. కానీ, బ్లాక్ యాపిల్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? నిజమేనండీ.. కానీ, ఒక్కో యాపిల్ పండు ఖరీదు మాత్రం రూ.500 వరకు ఉంటుంది. ఈ పండు చైనా, టిబెట్‌లోని న్యింగ్‌చీ పర్వత సానువుల్లో మాత్రమే పండుతుంది. దీన్ని ‘బ్లాక్ డైమాండ్ యాపిల్’ అని కూడా పిలుస్తారు. ధర ఎక్కువ కాబట్టి ఈ పండును చైనాలోని ఉన్నతస్థాయి రిటైలర్లకు మాత్రమే విక్రయిస్తారట. అది కూడా తక్కువ మొత్తంలోనే.