ఇన్‌స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్లతో ప్రధాని మోదీని అధిగమించిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్

54చూసినవారు
ఇన్‌స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్లతో ప్రధాని మోదీని అధిగమించిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్
ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లలో ప్రధాని నరేంద్ర మోడీని, బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్ దాటేశారు. పీఎం మోడీని ఇన్‌స్టాలో ప్రస్తుతం 91.3 మిలియన్ మంది ఫాలో అవుతుండగా, 91.5 మిలియన్ల ఫాలోవర్లతో శ్రద్ధా కపూర్ అధిగమించింది. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తర్వాత ఇన్‌స్టాలో అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన ఇండియన్ గా శ్రద్ధా నిలిచింది. ఇదిలా ఉండగా పీఎం మోడీకి ఎక్స్ లో 101.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్