ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి

63చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు-మావోయిస్టు దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. బీజాపుర్‌ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మద్దేడు ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు ఇటీవల ముగ్గురిని పోలీస్‌ ఇన్‌ఫార్మర్ల నెపంతో హతమార్చారు. తాజాగా భద్రతా బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు చేయగా.. ఎదురు కాల్పుల్లో సోమదా కల్ము(34), కవాసి హంగా(29) మరణించినట్లు బీజాపుర్‌ ఎస్పీ జితేంద్రయాదవ్‌ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్