దేశ రాజధాని ఢిల్లీలో పలు స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు కలకలం రేపాయి. ఈ మెయిల్ ద్వారా స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు వచ్చాయని అధికారులు గుర్తించారు. ఆర్కేపురంలోని రెండు స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. బాంబ్ స్క్వాడ్, పోలీసులు.. స్కూళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అన్ని చోట్లా తనిఖీలు చేస్తున్నారు.