నేడు టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్

78చూసినవారు
నేడు టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్
AP: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. కాకినాడ జేఎన్టీయూలో 14 రౌండ్స్‌లో 9 టేబుల్స్‌పై అధికారులు ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. కాగా, ఈ ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు పోటీ పడ్డారు. డిసెంబర్ 5న పోలింగ్ జరగగా.. 15,490 మంది ఓటు వేశారు. మొదటి ప్రాధాన్యతలో స్పష్టమైన మెజారిటీ రాకపోతే.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్