ఫుడ్ క్యాంటిన్‌లోకి దూసుకెళ్లిన లారీ, ఒక వ్యక్తి మృతి (వీడియో)

57చూసినవారు
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముంబై - పూణె ఎక్స్‌ప్రెస్ వేలో సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న ఓ ఫుడ్ క్యాంటిన్‌లోకి ఓ లారీ అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బిహార్‌కు చెందిన ఇంద్రదేవ్ పాశ్వాన్ అనే వ్యక్తి లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో పలు కారులు ధ్వంసమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్