తీవ్ర అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

76చూసినవారు
తీవ్ర అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం సోమవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బుధవారం నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరుకుంటుందని భావిస్తోంది. దీని ప్రభావంతో బుధ, గురు వారాల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. విపత్తుల నిర్వహణ సంస్థ మాత్రం ఈ నెల 15 వరకు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్