నాగ్‌పూర్ నుంచి కోల్‌కతా వెళ్తున్న విమానానికి గురువారం ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది. విమానంలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన పైలట్.. అధికారుల అనుమతితో విమానాన్ని రాయ్‌పూర్ కు దారి మళ్లించి అక్కడ సేఫ్‌గా ల్యాండ్ చేశారు. అనంతరం ప్రయాణికులందరిని దింపేశారు. పోలీసులు.. డాగ్ స్వ్కాడ్, బాంబ్ స్వ్కాడ్‌తో విమానాన్ని తనిఖీలు చేయగా ఎలాంటి పేలుడు పదార్థాలూ లభించలేదని తెలిసింది.