భద్రాచలం రామాలయంలో జులై 2 నుంచి బ్రేక్ దర్శనం అమల్లోకి రానున్నట్లు ఆలయ ఈవో రమదేవి తెలిపారు. ఇందుకు టికెట్ ధర రూ.200గా నిర్ణయించారు. ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 7.30 గంటల వరకు బ్రేక్ దర్శనానికి అనుమతిస్తామని ఈవో పేర్కొన్నారు. ఆ సమయంలో ఉచిత, ప్రత్యేక దర్శనంతో పాటు ఇతర సేవలు నిలిపివేస్తామని స్పష్టం చేశారు.