ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీవిత ఆధారంగా ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీకి 'అజయ్ ది అన్‌టోల్డ్ స్టోరి ఆఫ్ ఎ యోగి' అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే ఈ మూవీకి మహారాణి–2 ఫేమ్ రవీంద్ర గౌతమ్ దర్శకత్వం వహించనున్నారు. యోగి ఆదిత్యనాథ్ పాత్రను నటుడు అనంత్ జోషి పోషించనున్నారు. కాగా ఈ ఏడాదే ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.