దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్‌కు భారత కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కంపెనీతో పాటు అందులోని అధికారులకు 601 మిలియన్ డాలర్ల పన్నులతో కలిపి జరిమానా విధించింది. భారతీయ కరెన్సీలో ఇది రూ.5,154 కోట్లు. అయితే శాంసంగ్ టెలికాం పరికరాలకు సంబంధించిన దిగుమతి సుంకాన్ని తప్పించుకునేందుకు అవకతవకలకు పాల్పడినట్లు తెలియడంతో కేంద్రం ఈ చర్యలు చేపట్టింది.