రాజకీయ చరిత్రలోనే బీఆర్ఎస్ ది ప్రత్యేక స్థానం: కేసీఆర్

77చూసినవారు
రాజకీయ చరిత్రలోనే బీఆర్ఎస్ ది ప్రత్యేక స్థానం: కేసీఆర్
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాల పునాదుల మీద పుట్టి, ప్రత్యేక రాష్ట్రం సాధించిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. పదేళ్ల పాలనలో అద్భుతమైన ప్రగతి ఫలాలు అందించి, పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో విజయాలు సాధించిందన్నారు. ప్రపంచ రాజకీయ పార్టీల చరిత్రలోనే బీఆర్ఎస్ ది ప్రత్యేక స్థానం అని, ఆటుపోట్లు అధిగమించేందుకు బలమైన పునాదులు వేసింది కార్యకర్తలేనని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్